శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ షూటింగ్ పూర్తి !

‘ఇరుదు సుట్రు, సూరారై పోట్రు’ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సుధా కొంగర నెక్స్ట్ మూవీ ఇదే కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి.;

By :  K R K
Update: 2025-10-13 00:52 GMT

'మధరాసి'కి మిశ్రమ స్పందన వచ్చినా, శివకార్తికేయన్ తదుపరి సినిమా 'పరాశక్తి'లో మరింత పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు. సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ఇరుదు సుట్రు, సూరారై పోట్రు’ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సుధా కొంగర నెక్స్ట్ మూవీ ఇదే కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి.

ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తాజాగా వచ్చింది. అదేంటంటే, షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా, 2026 జనవరి 14న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

డాన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో రవి మోహన్, అధర్వ, రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్ వంటి ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా శివకార్తికేయన్ కు ఏ రేంజ్ లో సక్సెస్ ను అందిస్తుందో చూడాలి. 

Tags:    

Similar News