ఆది పినిశెట్టి విలన్ గా తమిళ చిత్రం?

ఇందులో విలన్ గా నటిస్తు్న్నాడట. అయితే సూపర్ ఇంట్రెస్టింగ్ రోల్ అట. కార్తి, ఆదితో పాటు మలయాళం నుంచి కూడా కొంతమంది యాక్టర్స్ ఈ సినిమాలో జాయిన్ అయ్యారు.;

By :  K R K
Update: 2025-08-25 01:51 GMT

ఆది పినిశెట్టి.. లేటెస్ట్‌గా ‘మయసభ’ వెబ్ సిరీస్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ బిగ్ బడ్జెట్ సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే అతని కిట్టీలో ‘అఖండ 2’ ఉంది. త్వరలోనే కార్తి హీరోగా చేస్తున్న ఓ మాసివ్ సినిమాలో కూడా ఆది సందడి చేయబోతున్నాడు. ‘మార్షల్’ అనే ఈ సినిమాని తమిళ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఈ సినిమాలో ఆది రోల్ కోసం నివిన్ పౌలీని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆది ఫైనల్ అయ్యాడు.

తాజా సమాచారం ప్రకారం.. ఆది ఇందులో విలన్ గా నటిస్తు్న్నాడట. అయితే సూపర్ ఇంట్రెస్టింగ్ రోల్ అట. కార్తి, ఆదితో పాటు మలయాళం నుంచి కూడా కొంతమంది యాక్టర్స్ ఈ సినిమాలో జాయిన్ అయ్యారు. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ లేడీగా చేస్తుండగా, సురాజ్ వెంజరమూడు, జయరాం కూడా కీలక రోల్స్‌లో కనిపించబోతున్నారు.

నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో ఓ స్పెషల్ కామియో చేస్తున్నాడని బజ్ ఉన్నా, అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న ఈ సినిమాని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది, వచ్చే ఏడాది ఈ మూవీ స్క్రీన్స్‌పై సందడి చేయనుంది.

Tags:    

Similar News