అజిత్ సినిమాపై ఇళయరాజా కేసు
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు ఇళయరాజా. వందల సినిమాలకు స్వరాలు సమకూర్చి, వేల పాటలతో కోట్లాది మందిని మాయ చేసిన ఈ మాస్ట్రో – ఇప్పుడు తన పాటల కాపీరైట్ హక్కుల విషయంలో తరచూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.;
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు ఇళయరాజా. వందల సినిమాలకు స్వరాలు సమకూర్చి, వేల పాటలతో కోట్లాది మందిని మాయ చేసిన ఈ మాస్ట్రో – ఇప్పుడు తన పాటల కాపీరైట్ హక్కుల విషయంలో తరచూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.
తాజాగా.. అజిత్‌కుమార్, త్రిష జంటగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంపై ఇళయరాజా కేసు వేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ‘ఇళమై ఇదో ఇదో, ఒత్త రూబాయుం తారెన్, ఎన్ జోడి మంజకరువి’ వంటి ఆయన క్లాసిక్ ట్యూన్స్‌ని అనుమతి లేకుండా వాడారని ఆరోపించారు.
‘పాటలను వెంటనే సినిమా నుంచి తొలగించాలి, రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలి’ అని ఇళయరాజా న్యాయవాదులు మద్రాసు హైకోర్టులో డిమాండ్ చేశారు. నిర్మాతలవైపు నుంచి 'యజమాని నుంచి అనుమతి తీసుకున్నాం' అని సమాధానం వచ్చినా, ఆ యజమాని ఎవరో చెప్పకపోవడం కొత్త ట్విస్ట్‌గా మారింది. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా పడింది.
ఇళయరాజా ఇలా తన ట్యూన్స్ విషయంలో కేసులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ‘మంజుమ్మల్ బాయ్స్’ టీంపై కూడా ఇలాగే కోర్టు కేసు వేసి పరిహారం గెలుచుకున్నారు. ఇళయరాజా తన ఆప్తమిత్రుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై కూడా అనుమతి లేకుండా పాటలు వాడారని నోటీసులు పంపడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
సినిమా అభిమానులు మాత్రం 'లెజెండ్ ఇళయరాజా, కానీ ఇలా కేసులు వేస్తూ తన ప్రతిష్ఠను తానే తగ్గించుకుంటున్నారు' అని విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం 'తన సృష్టిని కాపాడుకోవడమే ఆయన హక్కు' అని సమర్థిస్తున్నారు.