విశాల్ సినిమాల లైనప్ అదిరింది !
విశాల్ తన తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నాడు.;
కోలీవుడ్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ మదగజరాజా ఊహించని విజయంతో మంచి ఉత్సాహంగా ఉన్నాడు. 12 ఏళ్లుగా ల్యాబ్ కే పరిమితమైన ఈ చిత్రం అన్ని అడ్డంకులను అధిగమించి ఈ సంక్రాంతికి థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. తాము ఊహించని రిజల్ట్‌ను చూసి చిత్రబృందం కూడా ఆశ్చర్య పోయింది. దర్శకుడు సుందర్ సి ఈ విజయానికి మొత్తం క్రెడిట్ విశాల్ కే చెందుతుందని చెబుతున్నాడు.
ఈ ఘన విజయంతో విశాల్ తన తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నాడు. 2017లో హిట్ అందుకున్న ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’ ) సినిమా సీక్వెల్ ‘తుప్పరివాలన్ 2’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని తెలిపాడు. మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ సినిమాతో విశాల్ డైరెక్టర్‌గా మారబోతున్నాడు.
ఇంకా.. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్‌తో ఒక సినిమా చేస్తు్న్నాడు విశాల్. అలాగే ‘డీమాంటీకాలనీ’ ఫ్రాంచైజీ చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుతో కలిసి కొత్త సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే.. 2015లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘ఆంబళ’ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారని కూడా తెలిపాడు.