ధనుష్ - వెంకీ అట్లూరి సినిమా కోసం అదిరిపోయే టైటిల్
ధనుష్ హీరోగా రూపొందబోయే ఈ చిత్రానికి ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.;
‘తొలిప్రేమ’ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాడు యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. అయితే పీరియడ్ సినిమాల వైపు మొగ్గు చూపినప్పటి నుంచి అతడి బండి సరికొత్త స్పీడుతో దూసుకుపోతోంది. తాజాగా వచ్చిన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమానే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ చిత్రం తెలుగు, మలయాళం సహా పలు భాషల్లో ఘన విజయాన్ని సాధించి.. దుల్కర్ కెరీర్‌లో తొలి వంద కోట్ల గ్రాసర్‌గా నిలిచింది.
అంతకు ముందు ధనుష్‌తో తెరకెక్కించిన ‘సార్’ మూవీకూడా సూపర్ సక్సెస్ సాధించి సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ‘లక్కీ భాస్కర్, సార్’ చిత్రాలను నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మూడోసారి వెంకీ అట్లూరితో చేతులు కలిపింది. ధనుష్ హీరోగా రూపొందబోయే ఈ చిత్రానికి ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీ చుట్టూ తిరిగే డ్రామాగా ఈ సినిమా ఉంటుందని టాక్. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావల్సిఉంది.
ధనుష్ విషయానికొస్తే, గత ఏడాది తన దర్శకత్వంలో తెరకెక్కించిన రాయన్ మంచి హిట్ అయ్యింది. త్వరలో ఫిబ్రవరిలో ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న జాబిలమ్మ నీకు అంత కోపమా రిలీజ్ కానుంది. అనంతరం ఏప్రిల్‌లో ‘ఇడ్లీ కడై’ అనే మరో ఆసక్తికర చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.