గురూజీ తనయుడు డైరెక్షన్ లోకి.. సందీప్ రెడ్డి వద్ద శిక్షణ!
By : Surendra Nalamati
Update: 2025-02-20 16:13 GMT
టాలీవుడ్ లో హీరోల కొడుకులే కాదు, డైరెక్టర్స్ కుమారులు కూడా హీరోలుగా మారడానికే ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనయుడు మాత్రం తన తండ్రి తరహాలోనే దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్నాడట. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి వద్ద శిక్షణ పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ కుమారుడు.. ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వద్ద జాయిన్ అవ్వడానికి సిద్దమవుతున్నాడట.
'యానిమల్' తర్వాత సందీప్ 'స్పిరిట్' స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో నటించే ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. 'స్పిరిట్' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా సందీప్ వద్ద దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని.. ఆ తర్వాత తానే మెగాఫోన్ పట్టే సన్నాహాలు చేస్తున్నాడట గురూజీ తనయుడు.