తల్లీకొడుకుల ఎపిక్ ఫేస్ ఆఫ్!
నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తల్లీకొడుకులుగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ వేసవి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది.;
నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తల్లీకొడుకులుగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ వేసవి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది.
తెలుగులో పోలీస్ పాత్రలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన వారిలో విజయశాంతిని ప్రముఖంగా చెప్పుకోవాలి. ‘కర్తవ్యం‘ చిత్రంలో విజయశాంతి పోషించిన వైజయంతి పాత్ర జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఇప్పుడు ఆరోల్ ను కంటిన్యూటీగా ఈ మూవీని తీసుకొస్తున్నట్టు హీరో కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. లేటెస్ట్ గా ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్ ను రిలీజ్ చేసింది టీమ్.
తల్లి వైజయంతి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అయితే, కుమారుడు అర్జున్ మాత్రం వైజాగ్ నే కను సైగలతో శాసించే పాత్రలో కనిపించబోతున్నట్టు ఈ టీజర్ ను బట్టి తెలుస్తోంది. తల్లీకొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూనే కొన్ని అనివార్య కారణాలతో తల్లికే ఎదురెళ్లే పాత్రలో అర్జున్ రోల్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో తల్లీకొడుకుల ఎపిక్ ఫేస్ ఆఫ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతుంది టీమ్. టీజర్ లో పోలీస్ గా విజయశాంతి స్క్రీన్ ప్రెజెన్స్, అర్జున్ గా కళ్యాణ్ రామ్ మేకోవర్ ఆకట్టుకుంటున్నాయి.