ముఖ్యమంత్రిని కలుసుకున్న దుల్కర్
మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించిన దుల్కర్ సల్మాన్ అనతి కాలంలోనే అగ్ర కథానాయకుడిగా ఎదిగాడు.;
మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించిన దుల్కర్ సల్మాన్ అనతి కాలంలోనే అగ్ర కథానాయకుడిగా ఎదిగాడు. మాతృ భాష మలయాళంతో పాటు.. తెలుగులోనూ హీరోగానూ మంచి సక్సెస్ రేటుతో దూసుకెళ్తున్నాడు. ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‘ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న దుల్కర్.. ప్రస్తుతం తెలుగులో ‘కాంత, ఆకాశంలో ఒక తార‘ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇంకా.. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలోనూ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
తాజాగా దుల్కర్ సల్మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి నిర్మాతలు స్వప్న దత్, సుధాకర్ చెరుకూరి సహా కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దుల్కర్‌ను శాలువాతో సత్కరించారు.