కర్ణాటక సీఎంను కలిసిన చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ భారీ చిత్రానికి సంబంధించి మైసూర్‌లో ప్రత్యేకమైన షెడ్యూల్ జరుగుతోంది.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ భారీ చిత్రానికి సంబంధించి మైసూర్‌లో ప్రత్యేకమైన షెడ్యూల్ జరుగుతోంది.
శనివారం ఆయన అమ్మమ్మ అల్లు కనకరత్నమ్మ మృతిచెందడంతో హైదరాబాద్‌కి హుటాహుటిన వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్న రామ్ చరణ్, తిరిగి మైసూర్‌కి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
మైసూరు ప్రాంతానికి చెందిన సీఎం సిద్ధరామయ్య అధికారిక పర్యటనలో ఉండగా, రామ్ చరణ్‌తో ఆత్మీయంగా ముచ్చటించారు. చరణ్ తనవంతుగా ముఖ్యమంత్రిని శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమా గురించిన విశేషాలను కూడా సీఎం తెలుసుకున్నారు. భేటీ ముగిసిన తరువాత సిద్ధరామయ్య స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్‌ను కలిసిన విషయాన్ని వెల్లడిస్తూ, కొన్ని ఫోటోలు షేర్ చేశారు. చరణ్ కూడా కర్ణాటక ముఖ్యమంత్రిని కలవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.