‘సిటాడెల్ 2’ షూటింగ్ పూర్తి చేసిన గ్లోబల్ బ్యూటీ !

గ్లోబల్ ఐకాన్ తన అనుభవాన్ని ఒక రోలర్‌కోస్టర్ రైడ్‌గా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. ఈ వార్తను అభిమానులతో పంచుకుంది.;

By :  K R K
Update: 2025-01-25 03:51 GMT

బాలీవుడ్ క్రేజీ బ్యూటీ .. ప్రియాంక చోప్రా హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్ 2’ షూటింగ్‌ను పూర్తిచేసింది. గ్లోబల్ ఐకాన్ తన అనుభవాన్ని ఒక రోలర్‌కోస్టర్ రైడ్‌గా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. ఈ వార్తను అభిమానులతో పంచుకుంది.

“కొన్ని రోజులు ఆలస్యమైంది కానీ నేను నిజంగా ఒక రోలర్‌కోస్టర్‌లో ఉన్నట్టు అనిపించింది. మేము సిటాడెల్ సీజన్ 2 షూటింగ్ పూర్తిచేశాం. ఈ సంవత్సరం నాకు ఒక తుపాన్ లా సాగిపోయింది. కానీ ఇంత ప్రేమ, మద్దతుతో ఉక్కిరిబిక్కిరి చేయడం అన్నింటినీ సులభతరం చేసింది. కాస్ట్ అండ్ క్రూ.. ముఖ్యంగా నా టీమ్‌కి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వారు నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు హాలీడే సీజన్‌లోకి అడుగుపెడుతున్నాను. సౌండ్ ఆన్.. ” అని ప్రియాంక తన పోస్ట్‌లో పేర్కొంది.

ఆమె తన టీమ్‌తో కలిసి కొన్ని ఫోటోలు షేర్ చేయగా.. తన పాత్ర నదియా సిన్‌కి సంబంధించిన కొన్ని గ్లింప్స్ కూడా అందులో ఉన్నాయి. అలాగే చివరి రోజు షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు కూడా పంచుకుంది. ఇందులో స్టాన్లీ టూచీ కాస్ట్ మెంబర్ల కోసం మార్టినిస్ తయారు చేస్తున్న వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇటీవలే ప్రియాంక తన భర్త నిక్ జోనస్‌తో కలిసి తమ ఆరో వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. న్యూయార్క్ సిటీలో రొమాంటిక్ డిన్నర్ డేట్ నుండి.. వారి కుమార్తె మాల్టి మారీతో కలిసి ‘మోయానా’ చూడడం వంటి అనేక ప్రత్యేక క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

Tags:    

Similar News