‘భైరవం‘ ఓటీటీలోకి వచ్చేస్తోంది
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీ-స్టారర్ ‘భైరవం’. దేవాలయ భూముల కోసం చేసే రాజకీయ కుట్రలు, స్నేహితుల మధ్య పగలు వంటి ఎలిమెంట్స్ తో ఈ చిత్రం రూపొందింది.;
By : S D R
Update: 2025-07-08 10:35 GMT
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీ-స్టారర్ ‘భైరవం’. దేవాలయ భూముల కోసం చేసే రాజకీయ కుట్రలు, స్నేహితుల మధ్య పగలు వంటి ఎలిమెంట్స్ తో ఈ చిత్రం రూపొందింది. మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. తమిళ సూపర్ హిట్ మూవీ ‘గరుడన్’కు రీమేక్ గా ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల తెరకెక్కించాడు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో జయసుధ, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, అజయ్, శరత్ లోహితాశ్వ, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. లేటెస్ట్ గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. జూలై 18 నుంచి ZEE5లో ‘భైరవం‘ స్ట్రీమింగ్ కాబోతుంది.