అకీరా ఎంట్రీ.. వెండితెరపై కొత్త పవర్ స్టార్?
టాలీవుడ్‌లో అకీరానందన్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. అధికారిక ప్రకటన రానప్పటికీ అతని ఎంట్రీ గురించి తెర వెనుక సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు చర్చ నడుస్తోంది. అకీరా డెబ్యూ మూవీ కోసం కథను ఎంపిక చేసే బాధ్యతను ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అకీరా ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్నాడట. పవన్ కళ్యాణ్ నట గురువు సత్యానంద్ వద్దే అకీరా కూడా యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ పై దృష్టి పెట్టాడట. అలాగే డ్యాన్సుల్లోనూ మెలకువలు నేర్చుకుంటున్నాడట.
తండ్రి పవన్ కళ్యాణ్ స్థాయిని దృష్టిలో ఉంచుకుంటే, అకీరా ఎంట్రీ మామూలుగా ఉండదనే మాట నిజమే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు అతని లాంఛ్ కోసం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే అకీరానందన్ డెబ్యూకి సంబంధించి క్రేజీ న్యూస్ రావచ్చనేది ఫిల్మ్ నగర్ టాక్.