'కన్నప్ప' సినిమాకి ప్రీక్వెల్!

'కన్నప్ప' చిత్రం మంచు విష్ణు సినీ ప్రస్థానంలో ఓ మైలురాయిగా నిలిచింది. తన నటజీవితంలో అసలైన విజిటింగ్ కార్డ్‌గా ఈ చిత్రాన్ని భావిస్తున్న విష్ణు, లేటెస్ట్ గా హైదరాబాదులో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో ఈ సినిమా అనుభూతులను పంచుకున్నాడు.;

By :  S D R
Update: 2025-06-28 16:36 GMT

'కన్నప్ప' చిత్రం మంచు విష్ణు సినీ ప్రస్థానంలో ఓ మైలురాయిగా నిలిచింది. తన నటజీవితంలో అసలైన విజిటింగ్ కార్డ్‌గా ఈ చిత్రాన్ని భావిస్తున్న విష్ణు, లేటెస్ట్ గా హైదరాబాదులో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో ఈ సినిమా అనుభూతులను పంచుకున్నాడు.

వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నప్పటికీ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన సలహాతో గ్రాఫిక్స్‌ మీద మరింత దృష్టి పెట్టినట్లు విష్ణు తెలిపాడు. అయితే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్న స్థాయిలో రాకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందని చెప్పాడు.

ఈ ప్రాజెక్ట్ కోసం తన పేరుతో ఉన్న అన్ని ఆస్తులను తాకట్టు పెట్టిన విషయాన్ని పంచుకున్న విష్ణు, 'సక్సెస్ కాకపోతే నా జీవితమే మారిపోయేది' అంటూ భావోద్వేగంతో స్పందించాడు. ఈ సినిమా సీక్వెల్‌కు అవకాశంలేదని, కానీ 'కన్నప్ప' నాస్తికుడిగా ఉన్న సమయంలో ప్రీక్వెల్ కథపై చర్చించామని వెల్లడించాడు. విష్ణు ఈ సినిమా విజయాన్ని తండ్రి మోహన్ బాబుకే ఇచ్చాడు. అలాగే ప్రభాస్ 'కన్నప్ప' భారీ ఓపెనింగ్స్‌కి కారణమైయ్యాడంటూ ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నాడు.

Tags:    

Similar News