కీలక షెడ్యూల్ పూర్తి!

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయిన సాంగ్ షూట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. దీనితో ఈ షెడ్యూల్ పూర్తయింది.;

By :  K R K
Update: 2025-08-05 04:47 GMT

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది సందడి సమయం. ఒకప్పుడు అప్‌డేట్స్ కోసం ఎదురుచూపులు ఇప్పుడు పూర్తిగా సెలబ్రేషన్ మూడ్‌లోకి మారాయి. బ్యాక్-టు-బ్యాక్ అనౌన్స్‌మెంట్స్‌తో ఫ్యాన్స్‌లో జోష్ పీక్స్‌లో ఉంది. ఇక టైమ్ వచ్చేసింది.

‘ఓజీ’ సినిమాలోని “ఫైర్ స్టార్మ్ ” సాంగ్‌కి సూపర్ రెస్పాన్స్ తర్వాత, ఇప్పుడు అందరి ఫోకస్ “ఉస్తాద్ భగత్ సింగ్” మీదకి మళ్లింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయిన సాంగ్ షూట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. దీనితో ఈ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో కలిసి ఓ పవర్‌ఫుల్ ఫోటో షేర్ చేశారు. ఇద్దరూ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. మరి పవన్ ఫ్రెష్ లుక్ ఫ్యాన్స్‌కి హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రెడిట్‌ని ఫ్యాన్స్ హరీష్‌కి ఇస్తున్నారు.

రిమైనింగ్ షూట్ కూడా స్పీడ్‌గా సాగుతోంది. రాశీ ఖన్నా సెట్స్‌లో జాయిన్ అయ్యారు, శ్రీలీల తన పార్ట్ దాదాపు పూర్తి చేసేసింది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సినిమా సాంగ్స్ కంపోజిషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ టైమ్‌లో ఒక సాంగ్ రిలీజ్ అయితే.. ఇప్పటికే జోరుగా సాగుతున్న సినిమా సందడికి మరింత ఫైర్ యాడ్ అవుతుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” వచ్చే ఏడాది గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తోంది. “ఓజీ” కూడా జోష్‌లో ఉండడంతో, ఫ్యాన్స్‌కి మరిన్ని అప్‌డేట్స్, సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఈ సీజన్ ఒక ఫెస్టివల్ లాంటిదే!

Tags:    

Similar News

Suma Sri Reddy

Madhuri Dixit

Saiee M Manjrekar