దీపికపై వంగా వీరంగం!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ తో‘స్పిరిట్’ సినిమాను సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కకుండానే చర్చల్లో నిలుస్తోంది. లేటెస్ట్‌గా హీరోయిన్ ప్లేసులో స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె బదులు త్రిప్తి డిమ్రీని రీప్లేస్ చేశాడు.;

By :  S D R
Update: 2025-05-27 02:18 GMT

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ తో‘స్పిరిట్’ సినిమాను సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కకుండానే చర్చల్లో నిలుస్తోంది. లేటెస్ట్‌గా హీరోయిన్ ప్లేసులో స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె బదులు త్రిప్తి డిమ్రీని రీప్లేస్ చేశాడు. ఇది టాలీవుడ్ టు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ మూవీకి ఫస్ట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన దీపిక పదుకొనె.. ప్రాజెక్ట్ షురూ అవ్వడానికి ముందే కొన్ని కండిషన్స్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆమె వర్కింగ్ అవర్స్, రెమ్యురేషన్, స్క్రిప్ట్‌లో ఛేంజెస్ వంటి కండిషన్స్ పెట్టడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి అసంతృప్తికి లోనై.. ఆమెను సినిమా నుంచే తప్పించినట్టు తెలుస్తోంది.

దీపిక స్థానంలో ‘యానిమల్’ మూవీతో పాపులారిటీ సంపాదించిన త్రిప్తి డిమ్రీను హీరోయిన్ గా ఎంపిక చేశాడు. త్రిప్తిని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. సందీప్.. దీపిక బదులు త్రిప్తిని తీసుకోవడం వల్ల బాలీవుడ్ మీడియా వర్గాలు, ఆమె పీఆర్ టీం దుష్ప్రచారానికి దిగినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో, ‘స్పిరిట్’ స్టోరీని లీక్ చేయడం కూడా చేస్తున్నారు. ఈ విషయాలపై సందీప్ రెడ్డి ఫైర్ అయ్యాడు. తనపై డర్టీ పీఆర్ గేమ్స్ ఆడుతున్నారంటూ 'ఎక్స్' వేదికగా ఘాటుగా స్పందించాడు. దీపిక పేరు ప్రస్తావించకుండా ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తూ, 'మీ దురుద్దేశాల‌తో నా స్టోరీని లీక్ చేసినా నాకేం అనర్థం కాదు. స్టోరీ మొత్తం లీక్ చేయండి, నాకు భయం లేదు' అంటూ రెబల్ స్టైల్లో ట్వీట్ చేశాడు.

తన కథను పూర్తి నమ్మకంతో చెప్పాను, కానీ దాన్ని బయటపెట్టడమంటే నమ్మకానికి భంగం కలిగించడమేనని, ఇది వ్యక్తిత్వాన్ని చూపించే వ్యవహారమని వ్యాఖ్యానించాడు. తనపై వ్యక్తిగత దాడులు చేయడమే కాకుండా, తన ప్రాజెక్ట్‌ను అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈ చర్యలు జరుగుతున్నాయని సందీప్ అభిప్రాయపడ్డాడు. త్రిప్తి డిమ్రీని టార్గెట్ చేయడం, ఆమెను అవమానించడమంటే ఇదేనా ఫెమినిజం అని ప్రశ్నించాడు.

సందీప్ ట్వీట్ తో బాలీవుడ్ పీఆర్ మాఫియా పైనా, దీపిక వ్యవహార శైలిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోవైపు దీపిక పదుకొనె దీనిపై ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.




Tags:    

Similar News