'కాంతార' క్రేజ్ మళ్లీ మొదలైంది!
భారతీయ సినిమాల్లో మిస్టికల్ ఫోక్ డ్రామాకు సరికొత్త నిర్వచనంగా నిలిచింది 'కాంతార'. ఈ సూపర్ హిట్ మూవీకి ప్రీక్వెల్ గా 'కాంతార ఛాప్టర్ 1' నిన్న రిలీజయ్యింది. అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన 'కాంతార ఛాప్టర్ 1'కి తొలుత మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ దక్కుతుంది.;
భారతీయ సినిమాల్లో మిస్టికల్ ఫోక్ డ్రామాకు సరికొత్త నిర్వచనంగా నిలిచింది 'కాంతార'. ఈ సూపర్ హిట్ మూవీకి ప్రీక్వెల్ గా 'కాంతార ఛాప్టర్ 1' నిన్న రిలీజయ్యింది. అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన 'కాంతార ఛాప్టర్ 1'కి తొలుత మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ దక్కుతుంది.
ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, ప్రభాస్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. 'కాంతార ఛాప్టర్ 1 ఒక బ్రిలియంట్ మూవీ. ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. రిషబ్ శెట్టి, విజయ్ కిరగందూర్, హోంబలే ఫిల్మ్స్‌కి కంగ్రాట్స్' అని ప్రభాస్ ఈ చిత్రంపై తన రివ్యూ చెప్పాడు.
అంతకుముందే ఎన్టీఆర్ 'కాంతార ఛాప్టర్ 1'పై ప్రశంసలు కురిపించాడు. 'కాంతార చాప్టర్ 1 విజయం అద్భుతం. దర్శకుడిగానూ, నటుడిగానూ రిషబ్ ఊహించని అద్భుతాన్ని సృష్టించాడు' అంటూ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. మరోవైపు ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అదరగొట్టింది. ఇక తొలి రోజు వసూళ్లలోనూ సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఈ చిత్రం విడుదల కావడంతో లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది.