‘తెలుసు కదా’ ట్రైలర్.. సిద్ధు లవ్ గేమ్ స్టార్ట్!
సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘తెలుసు కదా‘. స్టైలిస్ట్ నీరజ కోన తెరకెక్కించిన రొమాంటిక్ ట్రయాంగులర్ ఎంటర్ టైనర్ ఇది.;
సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘తెలుసు కదా‘. స్టైలిస్ట్ నీరజ కోన తెరకెక్కించిన రొమాంటిక్ ట్రయాంగులర్ ఎంటర్ టైనర్ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ వచ్చేసింది.
సిద్ధు జొన్నలగడ్డ మార్క్ రొమాన్స్, రా అండ్ రస్టిక్ నెస్ తో ‘తెలుసు కదా‘ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇద్దరమ్మాయిలు (రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి) లతో లవ్, రొమాన్స్ ఈ ట్రైలర్ లో హైలైట్. ట్రైలర్ చివరిలో ప్రేమించిన ఇద్దరమ్మాయిలతోనూ కలిసి బ్రతకాడానికి సిద్ధు నిశ్చయించుకున్నాడా? అనే సందేహాన్ని ప్రేక్షకులకు వదిలేశారు. ఇక.. ఈ సినిమాతో ప్రేమకథల్లోనే ఓ కొత్త ప్రయోగానికి నీరజ కోన తెరదించబోతుందా? అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా.. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ‘తెలుసు కదా‘ థియేటర్లలోకి వస్తోంది.