'బాహుబలి' కోసం రంగంలోకి రాజమౌళి!
మేగ్నమ్ ఓపస్ 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ రిలీజై ఈ ఏడాదికి పదేళ్లయ్యింది. అయినా.. ఇప్పటికీ ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకమే. దేశవ్యాప్తంగా సినీ ప్రియులకు ఎంతో ఇష్టమైన చిత్రరాజం 'బాహుబలి'. అందుకే.. ఇప్పటి రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా 'బాహుబలి' రెండు పార్టులను ఒకే చిత్రంగా తీసుకొస్తున్నారు.;
మేగ్నమ్ ఓపస్ 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ రిలీజై ఈ ఏడాదికి పదేళ్లయ్యింది. అయినా.. ఇప్పటికీ ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకమే. దేశవ్యాప్తంగా సినీ ప్రియులకు ఎంతో ఇష్టమైన చిత్రరాజం 'బాహుబలి'. అందుకే.. ఇప్పటి రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా 'బాహుబలి' రెండు పార్టులను ఒకే చిత్రంగా తీసుకొస్తున్నారు. 'బాహుబలి.. ది ఎపిక్' పేరుతో రాబోతున్న ఈ మూవీ కోసం మళ్లీ రంగంలోకి దిగాడు దర్శకధీరుడు రాజమౌళి.
ప్రస్తుతం మహేష్‌తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ మీద పని చేస్తూనే.. 'బాహుబలి.. ది ఎపిక్' రీ ఎడిటింగ్ బాధ్యతలను తీసుకున్నాడు. 'బాహుబలి' కొత్త వెర్షన్ కోసం కొత్త కట్స్, అదనపు సన్నివేశాలు, రీ రికార్డింగ్ వంటి వాటిని దగ్గరుండి పరిశీలిస్తున్నాడట రాజమౌళి. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అక్టోబర్ 31న 'బాహుబలి ది ఎపిక్' ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఎంపిక చేసిన ఐమాక్స్ మరియు కొన్ని స్పెషల్ స్క్రీన్స్‌లో ఈ ఎపిక్ అనుభవం అందుబాటులో ఉండబోతుంది. ఇక అదే రోజు మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' కూడా థియేటర్లలోకి రాబోతుంది. దీంతో.. బాక్సాఫీస్ వద్ద 'బాహుబలి' వర్సెస్ 'మాస్ జాతర' పోరు ఆసక్తికరంగా మారే అవకాశాలూ ఉన్నాయి.