154 కోట్లతో దుమ్ముదులిపిన ‘ఓజీ‘
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. మొదటి షో నుంచే పవన్ అభిమానులు థియేటర్లను పండగవాతావరణంగా మార్చేశారు.;
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. మొదటి షో నుంచే పవన్ అభిమానులు థియేటర్లను పండగవాతావరణంగా మార్చేశారు. ఈ సినిమాకు వచ్చిన భారీ హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో తెలిసిందే. ఆ అంచనాలను నిజం చేస్తూ, ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.154 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇండియన్ సినిమా చరిత్రలో అరుదుగా మాత్రమే ఇలాంటి ఓపెనింగ్స్ చూడొచ్చు. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్, సుజీత్ స్టైలిష్ మేకింగ్, తమన్ మ్యూజిక్ అన్నీ కలిసి ‘ఓజీ’ని రికార్డు బ్రేకింగ్ ఓపెనర్‌గా నిలిపాయి. ఒక్కరోజులోనే ఇంత భారీ ఫిగర్ అందుకోవడం, పవన్ క్రేజ్ ఎంతటి స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది.
‘ఓజీ’ హవా ఇలా కొనసాగితే, రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దసరా సీజన్ ‘ఓజీ‘కి బాగా కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా.. లాంగ్ రన్ లో ‘ఓజీ‘ ఎలాంటి వసూళ్లు రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.