‘మిత్ర మండలి‘ రివ్యూ

దీపావళి కానుకగా ముందుగానే ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'మిత్ర మండలి'. బన్నీ వాసు సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య వంటి వారు నటించారు. ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్‌గా ఈరోజు ఆడియన్స్ ముందుకొచ్చిన 'మిత్ర మండలి' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.;

By :  S D R
Update: 2025-10-16 04:43 GMT

నటీనటులు: ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు.ఓ.ఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ తదితరులు

సినిమాటోగ్రఫీ:

సంగీతం: ఆర్.ఆర్‌.ధ్రువన్

ఎడిటింగ్ : పీకే

సమర్పణ: బన్నీ వాసు

నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల

దర్శకత్వం: విజ‌యేంద‌ర్‌

విడుదల తేది: అక్టోబర్ 16, 2025

దీపావళి కానుకగా ముందుగానే ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'మిత్ర మండలి'. బన్నీ వాసు సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య వంటి వారు నటించారు. ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్‌గా ఈరోజు ఆడియన్స్ ముందుకొచ్చిన 'మిత్ర మండలి' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

జంగ్లీపట్నం అనే ఊర్లో నారాయణ (వీటీవీ గణేష్) అనే కుల లీడర్ ఉంటాడు. కులపిచ్చితో మునిగిపోయిన ఆయనకు ఎమ్మెల్యే కావాలనే తాపత్రయం. సరిగ్గా అదే సమయంలో ఆయన కూతురు స్వేచ్ఛ (నిహారిక) వేరే కులానికి చెందిన చైతన్య (ప్రియదర్శి)తో పారిపోతుంది.

ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో నారాయణ, ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్) సహాయంతో కిడ్నాప్‌ అయ్యింది అనే అబద్ధపు కేసు వేస్తాడు. ఆ తర్వాత ఈ కేసులో చైతన్యతో పాటు అతని ఫ్రెండ్స్‌ అభి (రాగ మ‌యూర్‌), సాత్విక్‌ (విష్ణు), రాజీవ్‌ (ప్ర‌శాంత్ బెర‌హా) చిక్కుల్లో పడతారు.

ఇక అసలు స్వేచ్ఛ నిజంగా ఎవరిని ప్రేమిస్తుంది? ఆమె ఎందుకు పారిపోయింది? నారాయణ తన కులపిచ్చి, రాజకీయ ఆశల కోసం ఎంత దూరం వెళ్ళాడు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

‘మిత్ర మండలి’ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కోసం తీసిన సెటైరికల్ కామెడీ. కథకు పెద్దగా లాజిక్ లేదు, యూనిట్ కూడా అది ముందుగానే చెప్పింది. కులం పిచ్చితో ఉండే నారాయణ అనే వ్యక్తి జీవితంలో జరిగే పరిణామాలను స్పూఫ్ స్టైల్లో చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ విషయానికొస్తే కుల వ్యవస్థపై, ప్రేమ–పెళ్లిళ్లలో కులం చూసే వారి మీద వేసిన సామాజిక సెటైర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు, మ్యారేజ్ ఎపిసోడ్‌లో కొంత ఫన్ ఉంది. సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం వంటి కామెడీ నటులు తెరపై కంటిన్యూ ఎంటర్టైన్ చేస్తారు.

అయితే.. స్టోరీ, స్క్రీన్‌ప్లే లోపం కారణంగా కామెడీ ఎక్కువ భాగం ఫ్లాట్‌గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ స్కిట్‌ల మాదిరిగా కనిపిస్తాయి. ఓవరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. మొదటి సాంగ్, కొన్ని పాత్రలు అవసరం లేనట్టే అనిపిస్తాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

ఈ సినిమాలో టాప్ కమెడియన్స్ ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, వెన్నెల కిషోర్, ప్రసాద్ బెహరా, విటివీ గణేష్ వంటి వారున్నారు. వీరంతా తమ పాత్రలకు న్యాయం చేసినా.. కథలో దమ్ములేకపోవడంతో అది అంతగా వర్కవుట్ కాలేదు. సత్య మాత్రం మధ్యలో వచ్చి కథకి కొంత వేగం తీసుకువచ్చాడు.

నిహారిక హీరోయిన్‌గా పర్వాలేదనిపించినా, లుక్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది. ఫేస్ కట్స్, డైలాగ్ డెలివరీ అంతగా ఆకట్టుకోలేదు. బ్రహ్మానందం ఓ పాటలో మాత్రమే కనిపించాడు.

డైరెక్టర్ విజయేందర్ సింపుల్ స్టోరీని సెటైరికల్ పద్ధతిలో చూపించడానికి ప్రయత్నించినా, స్క్రీన్‌ప్లేలో బలం తగ్గింది. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు స్పూఫ్ స్టైల్లో వినోదం పంచాయి. అయితే కొన్ని సీన్లు ల్యాగ్ అవడంతో ఎడిటింగ్ మరింత కట్టుదిట్టంగా ఉండాల్సింది.

చివరగా

'మిత్ర మండలి'.. టాప్ కమెడియన్స్ ఉన్నా.. నవ్వులు మాత్రం మిస్సింగ్!

Tags:    

Similar News