తుఫాన్ సృష్టిస్తున్న మేకింగ్ వీడియో
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ విడుదలకు సిద్ధమవుతోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా జూలై 24న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.;
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ విడుదలకు సిద్ధమవుతోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా జూలై 24న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లను మరింత వేగవంతం చేసింది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మాస్, క్లాస్ ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది. పవన్ కళ్యాణ్ విభిన్న గెటప్పులు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, చారిత్రక నేపథ్యం, హై బడ్జెట్ విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో సినిమాపై హైప్‌ను మరింత పెంచేసింది.
'పులిని తినే బెబ్బులొచ్చెరో దొర..' అనే పాట నేపథ్యంలో మేకింగ్ విజువల్స్ చూపిస్తూ విడుదల చేసిన ఈ వీడియో, తెర వెనుక టీమ్ ఎంత కష్టపడిందో స్పష్టంగా వెల్లడిస్తోంది. 17వ శతాబ్దాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన చార్మినార్ వంటి సెట్స్, యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ ప్రిపరేషన్స్ వంటివి ఈ మేకింగ్ వీడియోలో హైలైట్ గా ఉన్నాయి. జ్యోతికృష్ణ- క్రిష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిలుస్తోందనే అంచనాలు ఉన్నాయి.