ఉత్తరాదిలో యోగి – దక్షిణాదిలో బాబు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు'. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో గట్టి హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు అనేక వాయిదాలు ఎదుర్కొన్న ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లను వేగవంతం చేయబోతుంది టీమ్.
సినిమా విడుదలకు ముందు రెండు మెగా ప్రీ-రిలీజ్ ఈవెంట్లను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జూలై 17న వారణాసిలో మొదటి ఈవెంట్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్న ప్రచారం ఉంది. ఈ ఈవెంట్ ద్వారా నార్త్ ఇండియాలో సినిమా బజ్ పెంచే లక్ష్యంగా యూనిట్ కసరత్తు చేస్తోంది.
మరోవైపు జూలై 19న తిరుపతిలో రెండవ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. దీనికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది. ఈ రెండు ఈవెంట్లతో నార్త్-సౌత్ ప్రేక్షకులను టార్గెట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇదిలావుంటే.. 'వీరమల్లు' చిత్రం పై ఓ వివాదం చెలరేగింది. సినిమా కథ తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జీవితానికి దగ్గరగా ఉందని, ఆయన చరిత్రను వక్రీకరించారని ముదిరాజ్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం ఇది పూర్తిగా కల్పిత కథ అని, ఎలాంటి చారిత్రక వ్యక్తితో సంబంధం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, బీసీ సంఘాలు దీన్ని ఆపేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నాయి.
-
Home
-
Menu