గద్దర్ అవార్డుల విజేతలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల ప్రకటనను జ్యూరీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించిన ప్రముఖ నటి జయసుధ చేయగా, ఆమెకు తోడుగా ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు పాల్గొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ, "మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. వాటన్నింటినీ జ్యూరీ సమగ్రంగా పరిశీలించి విజేతలను తుది దశలో ఎంపిక చేశారు" అని తెలిపారు. ఈ అవార్డులు 14 ఏళ్ల విరామం తర్వాత ప్రకటించబడుతున్నట్లు పేర్కొన్నారు.
అవార్డుల కేటగిరీలు & ఎంపిక ప్రమాణాలు
మొత్తం 11 ప్రధాన కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ ప్రతి సంవత్సరానికి ఒక ఉత్తమ చిత్రం ఎంపిక చేశారు. అదే సమయంలో 2014–2023 మధ్య కాలంలో సెన్సార్ పొందిన చిత్రాలే పరిగణనలోకి తీసుకున్నారు.
2024 సంవత్సరానికి ప్రత్యేకంగా అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు అందజేయనున్నారు.
2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్ ఇవే..
కల్కి 2898ఏడీ (మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
పొట్టేల్ (రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
లక్కీ భాస్కర్ (మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి నివేదా థామస్ (35 - చిన్న కథ కాదు)
ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్: కల్కి
ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2)
ఉత్తమ హాస్య నటుడు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తువదలరా 2)
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ : కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ బాలల ఫిల్మ్ : 35 - చిన్న కథ కాదు
ఉత్తమ నూతన దర్శకుడు: యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ వినోదాత్మక చిత్రం : ఆయ్
ఉత్తమ చిత్రం హెరిటేజ్/హిస్టరీ: రజాకార్
-
Home
-
Menu