మంచు లక్ష్మి ఆగ్రహానికి కారణమేంటి?

మంచు లక్ష్మి ఆగ్రహానికి కారణమేంటి?
X
టాలీవుడ్‌ నటి, నిర్మాత మంచు లక్ష్మి తాజాగా చేసిన వ్యాఖ్యలు, ఆమె వేసిన ఫిర్యాదు ప్రస్తుతం సినీ నగరంలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఓ సీనియర్‌ సినీ జర్నలిస్టుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెపై అడిగిన కొన్ని ప్రశ్నలు వివాదంగా మారాయి.

టాలీవుడ్‌ నటి, నిర్మాత మంచు లక్ష్మి తాజాగా చేసిన వ్యాఖ్యలు, ఆమె వేసిన ఫిర్యాదు ప్రస్తుతం సినీ నగరంలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఓ సీనియర్‌ సినీ జర్నలిస్టుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెపై అడిగిన కొన్ని ప్రశ్నలు వివాదంగా మారాయి. ముఖ్యంగా ఆమె వయసు, ధరించే దుస్తులపై వేసిన ప్రశ్నలు మంచు లక్ష్మిని తీవ్రంగా కలిచివేశాయి.

"ఇది జర్నలిజం కాదు, నాపై జరిగిన దాడి" అంటూ ఆమె స్పష్టం చేశారు. "మహేష్ బాబుకు కూడా 50 ఏళ్లు వస్తున్నాయి. ఆయన షర్ట్ విప్పి తిరుగుతున్నారని ఎవరైనా అడిగారా? అయితే ఒక మహిళను మాత్రం ఇలా ప్రశ్నించడం ఎందుకు?" అంటూ ఆమె నిలదీశారు.

ఈ సంఘటనతో మౌనంగా ఉండకూడదని భావించిన మంచు లక్ష్మి, వెంటనే ఫిల్మ్ ఛాంబర్‌కి ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో ఆమె 'నాలుగేళ్ల తర్వాత తండ్రి మోహన్‌బాబుతో కలిసి తానే ప్రొడ్యూస్‌ చేసిన ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ సినిమాకు ఎంతో కష్టపడ్డా. కానీ ఆ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఒక్క మాట అడగకుండా, వయసు, శరీరం, దుస్తులపై కించపరిచేలా ప్రశ్నించారు. ఇది జర్నలిజం ముసుగులో ప్రదర్శించే క్రూరత్వం తప్ప మరొకటి కాదు. ఇలాంటి ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలి.' అని ఆమె అన్నారు.

అయితే ఈ వ్యవహారం వ్యక్తిగత స్థాయిలో ముగిసిపోలేదు. ఇప్పుడు ఇది జర్నలిజం పరిమితులు, మహిళలపై ప్రవర్తన, సినీ పరిశ్రమలో గౌరవం వంటి అంశాలపై పెద్ద చర్చకు దారితీసింది. ఒక జర్నలిస్టు ప్రశ్న ఎక్కడ వరకు వెళ్లాలి? విమర్శ అనే హద్దు దాటి, వ్యక్తిగత జీవితంపై దాడి చేసేంతవరకు వెళ్ళడం సమంజసమా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

Tags

Next Story