'వార్ 2' ట్విట్టర్ రివ్యూ

వార్ 2 ట్విట్టర్ రివ్యూ
X
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన మల్టీస్టారర్ 'వార్ 2' ఈరోజు వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో 'వార్ 2' రివ్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన మల్టీస్టారర్ 'వార్ 2' ఈరోజు వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో 'వార్ 2' రివ్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఎన్టీఆర్ ఎంట్రీ అదుర్స్ అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. తారక్ ఇంట్రడక్షన్ సీన్, షర్ట్‌లెస్ అవతారం థియేటర్లలో ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ అదుర్స్ అని చెబుతున్నారు ఫ్యాన్స్. మరోవైపు హృతిక్ రోషన్ ఎంట్రీ, స్టైల్ ఫుల్ మాస్ ఇంపాక్ట్ కలిగిస్తుందట. ఇద్దరూ స్క్రీన్‌పై కలిసే ప్రతి సీన్‌లో పవర్‌ఫుల్ కెమిస్ట్రీ చూపించారని రివ్యూస్ వస్తున్నాయి.

ఇక యాక్షన్‌లో హీరోలిద్దరూ నువ్వా నేనా అన్నట్లు ఫైట్స్ డిజైన్ ఉన్నాయని.. కొన్నిసార్లు ఎన్టీఆర్ హృతిక్‌ను డామినేట్ చేస్తే, మరికొన్ని సార్లు హృతిక్ ఆధిపత్యం చూపాడని వినిపిస్తుంది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఎన్టీఆర్ – హృతిక్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్ ఇంటర్వెల్ & క్లైమాక్స్ ట్విస్ట్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డ్యాన్స్ నంబర్స్ గా వినిపిస్తున్నాయి.

మరోవైపు కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ లోపాలు, కథలో లోపించిన కొత్తదనం, కొన్ని సీన్స్ లెంథీగా అనిపించడం వంటివి నెగటివ్ పాయింట్స్ గా వినిపిస్తున్నాయి. మొత్తంగా 'వార్ 2' గురించి ట్విట్టర్ లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

Tags

Next Story