ఫుల్ ఫైర్ లో 'విశ్వంభర'

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం చిరంజీవి, మౌనీ రాయ్ లపై స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. అందుకు సంబంధించి ఒక ఫోటోను ఇప్పటికే షేర్ చేసిన డైరెక్టర్ వశిష్ట.. లేటెస్ట్ గా ఆ పాటకు సంబంధించి ఓ విజువల్ మూమెంట్ ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు.
గెట్ రెడీ ఫర్ నాన్-స్టార్ విజిల్స్ అంటూ షేర్ చేసిన ఈ డ్యాన్సింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ పాటతో 'విశ్వంభర' షూట్ మొత్తంగా ఫినిష్ అవుతుంది. ఈ పాటను కీరవాణి కాకుండా భీమ్స్ కంపోజ్ చేశాడనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తైన తర్వాత 'విశ్వంభర' రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనుందట నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్.
Get Ready for Nonstop Whistles 🔥🔥💥
— Vassishta (@DirVassishta) July 26, 2025
A BOSS BLAST erupts for this on the big screen 🤗❤️#Vishwambhara Last Schedule on full FIRE 🔥 🔥 pic.twitter.com/9kZ2XlixIL
-
Home
-
Menu