దీపావళి బరిలో 'విశ్వంభర'?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్స్ లో ‘విశ్వంభర’ ఒకటి. 'బింబిసార' ఫేమ్ వశిష్ట్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అసలు మొదట ఈ చిత్రాన్ని 2024లోనే విడుదల చేయాలని భావించారు.
కానీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అనేక కారణాలతో చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనులు ఎక్కువ సమయం తీసుకోవడంతో విడుదల ఆలస్యమైంది. దర్శకుడు వశిష్ట్ ఈ సినిమా పనులను నెమ్మదిగా చేస్తున్నా పర్ఫెక్ట్ అవుట్ పుట్ తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నాడట.
లేటెస్ట్ గా 'విశ్వంభర' విడుదల గురించి కొత్త న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. పండుగ సీజన్‌లో రిలీజ్ చేస్తే మాస్ ఆడియెన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కూడా థియేటర్లకు భారీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీపావళి ఫెస్టివల్ ను టార్గెట్ చేసిందట టీమ్. మరోవైపు 'విశ్వంభర' వచ్చే ఏడాది ఏప్రిల్ కి రాబోతుందనే మరో న్యూస్ కూడా నెట్టింట జోరుగా స్ప్రెడ్ అవుతుంది.
ఏదేమైనా ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్ గా 'విశ్వంభర' టీజర్ వస్తుందని భావిస్తున్నారు. ఆ టీజర్ లోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో చిరుకి జోడీగా త్రిష నటిస్తుంటే.. కీలక పాత్రల్లో ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, సురభి, కునాల్ కపూర్ వంటి వారు కనిపించబోతున్నారు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
-
Home
-
Menu