విజయ్–రష్మిక ఎంగేజ్‌మెంట్!

టాలీవుడ్‌లో ఎప్పటినుంచో వినిపిస్తున్న ఒక రూమర్ నిజమైంది. రైడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి పీటలెక్కబోతున్నారు. దసరా పండుగ శుభదినాన, అత్యంత రహస్యంగా, ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇండస్ట్రీలోని కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారని సమాచారం.
విజయ్-రష్మిక తొలిసారిగా ‘గీత గోవిందం’ సినిమాలో నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఆ స్నేహం ‘డియర్ కామ్రేడ్’తో మరింత గాఢమై ప్రేమలోకి మారిందట. ఇద్దరూ కలిసి విహారయాత్రలు, ఒకే తరహా దుస్తులు, పబ్లిక్‌లో కలిసి కనిపించడం వంటివి చేయడం వీరి రిలేషన్‌పై ఊహాగానాలకు బలం చేకూర్చాయి. అయితే ఈ జంట మాత్రం ఎప్పుడూ మీడియా ముందు నేరుగా స్పందించకుండా చాలా డిప్లొమాటిక్‌గా మౌనం పాటించడం గమనార్హం.
అయితే ఇప్పుడు నిశ్చితార్థం జరగడంతో అన్ని రూమర్స్‌కి పక్కా ఎండ్ పడింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ వేడుక జరిగిందట. విజయ్-రష్మిక త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవబోతున్నారని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి చివరిలో ఓ ఫేమస్ డెస్టినేషన్‌లో వీరి పెళ్లి జరగనుందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం.
గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం జరిగి తర్వాత బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి సారించి, వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ నేషనల్ లెవెల్ స్టార్‌గా ఎదిగింది. ‘యానిమల్, పుష్ప 2, ఛావా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది.
విజయ్ దేవరకొండ కూడా కెరీర్ పరంగా మంచి ఊపులోనే ఉన్నాడు. 'కింగ్డమ్' తర్వాత విజయ్ నుంచి ఇప్పుడు రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఒకటి రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో పీరియాడిక్ డ్రామా కాగా.. మరొకటి దిల్‌రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్థన్'. మొత్తంగా.. టాలీవుడ్‌లో చాలా కాలంగా ఈ జంట గురించి హాట్ టాపిక్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు అది నిజమైందని తెలిసి అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
Home
-
Menu