చిత్తూరు యాసలో అదరగొట్టిన విజయ్!

విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘కింగ్డమ్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా, సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. జూలై 31న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది.
తిరుపతిలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ అభిమానుల సందడితో మెరిసిపోయింది. ఈ వేడుకలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ – 'జెర్సీ తర్వాత గౌతమ్ ఈ కథపైనే ఐదేళ్లు పనిచేశాడు. ఈసారి మేము మంచి ఓపెనింగ్స్ ఆశిస్తున్నాం. విజయ్‌కి మంచి హిట్ ఇవ్వాలని గౌతమ్, నేను ప్రయత్నించాం. ఇండస్ట్రీ పరిస్థితి అంత బాగోలేదు. థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తేనే మేము ఇంకా మంచి సినిమాలు చేస్తాం' అన్నారు.
ఈ ఈవెంట్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ స్పీచ్ హైలైట్ గా నిలిచింది. విజయ్ పూర్తిగా చిత్తూరు యాసలో మాట్లాడుతూ, పుష్ప మూవీ స్టైల్‌లో 'తిరుపతి వెంకన్న సామీ గాని.. ఈ ఒక్కసారి నా పక్కనుండి నడిపించినాడో.. చానా పెద్దోన్నయి పూడుస్తాను సామి.. పోయి టాప్‌లో కూసుంటా' అన్న డైలాగ్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.
అలాగే ''కింగ్డమ్' కోసం కేవలం నేనే కాదు.. గౌతమ్, నాగవంశీ, భాగ్యశ్రీ, అనిరుధ్ ఎంతో కష్టపడ్డారు. వాళ్లకోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ చిత్రం నా మనసుకు చాలా ప్రత్యేకం' అని తన ఎమోషన్‌ను పంచుకున్నాడు. మొత్తానికి తిరుపతిలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ రౌడీ ఫ్యాన్స్‌కు పండుగలా మారింది.
-
Home
-
Menu