విజయ్-దిల్ రాజు సినిమా ముహూర్తం

విజయ్-దిల్ రాజు సినిమా ముహూర్తం
X
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమాని ప్రారంభించాడు. చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన రవికిరణ్ కోలా మూవీ ముహూర్తాన్ని జరుపుకుంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమాని ప్రారంభించాడు. చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన రవికిరణ్ కోలా మూవీ ముహూర్తాన్ని జరుపుకుంది. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 59వ చిత్రంగా నిర్మిస్తున్నారు. శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో ‘మహానటి‘ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండటం విశేషం. ‘మహానటి‘ సినిమాలో కలిసి సందడి చేయకపోయినా.. ఈసారి మాత్రం పెయిర్ గా కనిపించబోతున్నారు విజయ్-కీర్తి. ఈ సినిమా ముహూర్తానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఎ వైల్డ్ బిగినింగ్.. లవ్, రేజ్, బ్లడ్‘ అంటూ ఈ మూవీ అవుట్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్నట్టు చెప్పకనే చెప్పారు మేకర్స్. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ మూవీకి ‘రౌడీ జనార్థన్‘ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.



Tags

Next Story