చిరు తర్వాత బాలయ్యతో వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం'తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేష్.. ఆ తర్వాత ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటివరకూ వెంకటేష్ కి సంబంధించిన తర్వాతి సినిమాలపై అధికారికంగా ప్రకటనలు రాలేదు. అయితే.. లేటెస్ట్ గా అమెరికాలో జరిగిన నాట్స్ వేడుకలో పాల్గొన్న వెంకీ, తన రాబోయే ప్రాజెక్టులపై ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చాడు.
వెంకటేష్ తన లైనప్‌లో ఉన్న అయిదు సినిమాల గురించి క్లారిటీ ఇచ్చాడు. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తవుతున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 157లో ఫన్నీ కేమియోలో మురిపించబోతున్నాడడు. ఈ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతోంది. ఇందులో వెంకీ స్పెషల్ రోల్ హైలైట్ కానుందట.
‘సంక్రాంతికి వస్తున్నాం‘ తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమాని లైన్లో పెడుతున్నాడట. ఈ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం‘ సీక్వెల్ కావచ్చనే అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే సూపర్ హిట్టైన ‘దృశ్యం‘ సిరీస్ లో మూడో సినిమాలోనూ వెంకీ నటించబోతున్నాడు.
వీటితో పాటు నందమూరి బాలకృష్ణతో ఓ మల్టీస్టారర్ చేయనున్నట్టు వెంకీ క్లారిటీ ఇచ్చాడు. తన చిరకాల స్నేహితుడైన బాలయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే బాలయ్య-వెంకీ కలిసి సందడి చేయబోయే సినిమాకి దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా.. రాబోయే రెండు, మూడేళ్లు వెంకీ డైరీ ఫుల్ అయిపోయినట్టే అన్నమాట.
-
Home
-
Menu