'వీరమల్లు' Vs 'రామాయణ'

ఈరోజు (జూలై 3) సినిమా ప్రియులకు ఓ స్పెషల్ ట్రీట్ అందించబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా తెరకెక్కుతున్న రెండు ఎపిక్ చిత్రాలు – పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణ’ – రెండింటి నుంచి కీలక గ్లింప్సెస్ ఒకే రోజున విడుదల కాబోతుండటంతో ఈరోజు సినీ వర్గాల్లో టాక్ అఫ్ ది డేగా మారింది.
ఈరోజు ఉదయం 11.10 గంటలకు పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ విడుదల కానుంది. దాదాపు 3 నిమిషాల 1 సెకన్ నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు క్రిష్ – జ్యోతికృష్ణ సంయుక్త దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మొఘులుల కాలం నాటి కథతో రూపొందింది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం, ఏ.ఎం. రత్నం నిర్మాణ విలువలు ఈ సినిమాకు మరింత గ్రాండ్ ఫీల్ ఇవ్వనున్నాయి. జూలై 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
మరోవైపు, ఈ ఉదయం 11.30 గంటలకు బాలీవుడ్‌కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ కానుంది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండటం ఇప్పటికే భారీ క్రేజ్‌ను తెచ్చింది. ఈ గ్లింప్స్‌ను దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో థియేటర్లలో గ్రాండ్ లాంచ్ చేస్తున్నారు – బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, పూణె, కొచ్చి నగరాల్లో ప్రత్యేక షోల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ రెండు గ్లింప్సెస్ ఒకే రోజున విడుదలవుతుండటంతో… సోషల్ మీడియాలోనూ భారీ హైప్ నెలకొంది. ఒకటి హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ – మరొకటి మైథలాజికల్ విజువల్ స్పెక్టాకిల్! రెండు చిత్రాలు తెలుగు, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్నాయి.
-
Home
-
Menu