'వీరమల్లు'కి గుమ్మడికాయ కొట్టేశారు!

వీరమల్లుకి గుమ్మడికాయ కొట్టేశారు!
X
పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ చివరికి చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ చివరికి చిత్రీకరణను పూర్తిచేసుకుంది. రాజకీయాల్లో తలమునకలైన పవన్, షూటింగ్‌కి ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయించి, చివరి షెడ్యూల్‌ను పూర్తిచేశారు. దీంతో చిత్ర బృందం సంప్రదాయబద్ధంగా చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టేసింది.

మొఘలుల కాలంనాటి కథను నేపథ్యంగా తీసుకుని ఫిక్షనల్ స్టోరీగా 'హరిహర వీరమల్లు'ని రూపొందించారు. ఈ సినిమాకి తొలుత క్రిష్ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించగా, తరువాత నిర్మాత ఎ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన యోధుడిగా కనిపించనుండడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, బాబీ డియోల్, సునీల్ కీలక పాత్రలు పోషించారు.

ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. త్వరలోనే ట్రైలర్, మిగతా పాటలను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి త్వరలోనే క్లారిటీ ఇవ్వనుందట టీమ్.



Tags

Next Story