కొత్త షెడ్యూల్ లో 'ఉస్తాద్'

పవన్ కళ్యాణ్ 'ఓజీ'తో సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో ఇప్పుడు ఇప్పుడు పవర్ ఫ్యాన్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ కీలక సీన్స్ షూట్ పూర్తయ్యింది. లేటెస్ట్ గా ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ సెట్స్ నుండి తుపాకీతో ఇచ్చిన పోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఫిలిం సర్కిల్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను 2026 శివరాత్రికి విడుదల చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారట. గతంలో పవన్–హరీష్ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ అయ్యింది. అదే కాంబినేషన్ మళ్లీ వస్తుండటంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
-
Home
-
Menu