స్టైలిష్ లుక్ లో ‘ఉస్తాద్‘

స్టైలిష్ లుక్ లో ‘ఉస్తాద్‘
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి పవర్ స్టార్ బర్త్ డే పోస్టర్ వచ్చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి పవర్ స్టార్ బర్త్ డే పోస్టర్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ క్యాప్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్న ఈ స్టైలిష్ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

హ్యాపీ బర్త్ డే టు ఉస్తాద్ ఆఫ్ స్టైల్, స్వాగ్ అండ్ బాక్సాఫీస్ పవర్ స్టార్ అంటూ పవన్ కి బర్త్ డే విషెస్ తెలిపింది టీమ్. అలాగే ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ అభిమానులకు ఓ విజువల్ ఫీస్ట్ అందించబోతుందని తెలుపుతూ ఈ బర్త్ డే పోస్ట్ పెట్టింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

‘గబ్బర్ సింగ్‘ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తోన్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. ముందుగా ఈ సినిమా తమిళ చిత్రం ‘తెరి‘ రీమేక్ గా ప్రచారం జరిగినా.. ఈ సినిమాని కొత్త కథతో రూపొందిస్తున్నట్టు టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో పవన్ మరోసారి పోలీస్ డ్రెస్ లో కనువిందు చేయబోతున్నాడు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వచ్చే ఏడాది ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.


Tags

Next Story