టికెట్ బుకింగ్స్ ఓపెన్

టికెట్ బుకింగ్స్ ఓపెన్
X
ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఒక రోజు ముందుగానే ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి 'వార్ 2, కూలీ' చిత్రాలు.

ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఒక రోజు ముందుగానే ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి 'వార్ 2, కూలీ' చిత్రాలు. ఒకవైపు రజనీకాంత్ తో పాటు నాగార్జున నటించిన ‘కూలీ’, మరోవైపు హృతిక్ తో పాటు ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ కావడంతో ఈ రెండు సినిమాలపైనా తెలుగు రాష్ట్రాలలోనూ భారీ హైప్ ఉంది. పేరుకు అనువాద సినిమాలే అయినా.. నాగ్, తారక్ ఉండడంతో ఈ చిత్రాలకు స్ట్రెయిట్ మూవీస్ రేంజులో ఓపెనింగ్స్ దక్కబోతున్నాయి.

ఈ రెండు సినిమాలకు సంబంధించి టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో మొదట 50-75 రూపాయల పెంపు అనుమతిస్తారని వినిపించినా ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. తెలంగాణలోనూ రెండు సినిమాలకూ టికెట్ రేట్లు పెంపు లేదు. ప్రస్తుతం 'కూలీ, వార్ 2' రెండు సినిమాలకూ తెలంగాణలో టికెట్ బుకింగ్స్ ఓ రేంజులో జరుగుతున్నాయి.

Tags

Next Story