ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ ‘ఓజీ’

పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. విడుదలైన తొలి రోజే రూ.154 కోట్ల కలెక్షన్లతో సునామీలా దూసుకెళ్లిన ఈ సినిమా, పది రోజుల్లో రూ.300 కోట్ల మార్క్‌ను దాటేసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డును బద్దలుకొట్టింది. ఇప్పుడు టాలీవుడ్‌లో 2025 సంవత్సరం హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది.
జపాన్ నుంచి ముంబయి మాఫియాల వరకూ సాగిన గంభీర (పవన్ కళ్యాణ్) యాక్షన్ జర్నీకి ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది. ప్రతి పదినిమిషాలకో ఎలివేషన్, పవన్ మాస్ చరిష్మా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ – ఇవన్నీ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి.
మరికొన్ని రోజుల్లో ‘ఓజీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్టెండెడ్ కట్ వెర్షన్‌తో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. ఇదే కాదు దర్శకుడు సుజీత్ మాటల్లో, 'ఓజీకి ప్రీక్వెల్, సీక్వెల్ రెండూ వస్తాయి' అంటున్నారు. పవన్ పవర్ ఒక్కసారి రైట్ డైరెక్షన్‌లో వెళ్తే, ఎలాంటి తుఫాన్ సృష్టించగలడో ‘ఓజీ’ మరోసారి నిరూపించింది.
Alalika Kadhalaka Bhayapadele…
— DVV Entertainment (@DVVMovies) October 5, 2025
Kshanakshanamoka Thala Thegi Padele…
Pralayamu Yedhuruga Nilabadele..
Meti Dhaatiki Lokam Hadale…#OG is the highest grossing Telugu Film of 2025 🔥🔥🔥🔥#TheyCallHimOG #BoxOfficeDestructorOG pic.twitter.com/TGQYcilw3C
-
Home
-
Menu