‘ది రాజా సాబ్‘ ట్రైలర్ వచ్చేసింది!

సినీ ప్రియుల కోసం మరో విజువల్ ఫీస్ట్ రెడీ అయ్యింది. రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్‘ థియేటర్లలోకి వచ్చేస్తోంది. డార్లింగ్ నుంచి ఫస్ట్ టైమ్ హారర్ కామెడీ జానర్ లో రాబోతున్న సినిమా ఇది. ఇప్పటికే ఇలాంటి తరహా జానర్స్ లో సినిమాలు తీసి హిట్ కొట్టిన మారుతి ఈ చిత్రానికి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘ది రాజా సాబ్‘ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.
ట్రైలర్ ఆద్యంతం కళ్లు మిరుమిట్లు గొలిపే విజువల్ ఎఫెక్ట్స్ తో విజువల్ ఫీస్ట్ అందిస్తుంది. ప్రభాస్ ఒక క్యారెక్టర్ లో భయపడుతూనే ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ.. మరొక క్యారెక్టర్ లో రాక్షసుడిగా భయపెడుతూ రెండు డిఫరెంట్ షేడ్స్ లో అదరగొడుతున్నాడు. మరోవైపు ప్రభాస్ తాత పాత్రలో సంజయ్ దత్ ఘోస్ట్ గా అలరించబోతున్నాడు.
హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తుండగా.. బోమన్ ఇరానీ, జరీనా వాహబ్ ఇతర కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. తమన్ బి.జి.ఎమ్. ఈ ట్రైలర్ కి మరో హైలైట్. మొత్తంగా.. ట్రైలర్ తో అంచనాలు భారీగా పెంచిన ‘ది రాజా సాబ్‘ సంక్రాంతి కానుకగా జనవరి 9న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.
-
Home
-
Menu