'కన్నప్ప'ను వీక్షించిన సూపర్‌స్టార్!

తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిన చిత్రాలలో ‘పెదరాయుడు’ ఒకటి. 1995 జూన్ 15న విడుదలైన ఈ చిత్రం ముప్పై ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ‘పాపా రాయుడు’ పాత్రలో నటించిన సూపర్ స్టార్ రజనీకాంత్, టైటిల్ రోల్ పోషించిన మోహన్ బాబు చెన్నైలో కలుసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి, నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.
అదే రోజు, రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి విష్ణు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’ను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా పూర్తయిన తరువాత, రజనీకాంత్ సినిమా అద్భుతంగా ఉందంటూ విష్ణును హత్తుకుని అభినందించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన విష్ణు, 'ఈ క్షణం కోసం 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మోహన్ బాబు కూడా ఈ సందర్భంగా స్పందిస్తూ, 'పెదరాయుడు 30 ఏళ్ల జరుపుకుంటున్న రోజునే, నా మిత్రుడు రజనీకాంత్ ‘కన్నప్ప’ చూశారు. ఆయన అభినందనలు, ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను' అన్నారు. ప్రస్తుతం 'పెదరాయుడుతో పాపా రాయుడు' అంటూ రజినీకాంత్ చేసిన వ్యాఖ్య నెట్టింట్లో వైరల్ అవుతోంది.
On June 15, Pedarayudu completed 30 glorious years since its theatrical release.
— Mohan Babu M (@themohanbabu) June 16, 2025
And on the same day, my best friend @rajinikanth watched #Kannappa along with his family.
The love, warmth, and encouragement he gave after the film is something I will never forget.
Thank you,… pic.twitter.com/u5iqXlsjfr
Last night, @rajinikanth uncle watched #Kannappa. After the film, he gave me a tight hug. He told me that he loved #Kannappa.
— Vishnu Manchu (@iVishnuManchu) June 16, 2025
I’ve been waiting 22 years as an actor for that hug!!!
Today, I feel encouraged. Humbled. Grateful. #Kannappa is coming on 27th June and I can’t wait… pic.twitter.com/HDYlLuDsdc
-
Home
-
Menu