మళ్లీ మొదలైన ‘ది రాజా సాబ్‘

మళ్లీ మొదలైన ‘ది రాజా సాబ్‘
X
రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే వాటిలో ఏది ముందుగా థియేటర్లకు రానుంది? ఏది ఆలస్యం అవుతుంది? అనే విషయంలో స్పష్టత లేక అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. లేటెస్ట్ గా ఈ గందరగోళానికి తెరపడినట్టే.

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే వాటిలో ఏది ముందుగా థియేటర్లకు రానుంది? ఏది ఆలస్యం అవుతుంది? అనే విషయంలో స్పష్టత లేక అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. లేటెస్ట్ గా ఈ గందరగోళానికి తెరపడినట్టే. ప్రభాస్ నుంచి ముందుగా ‘ది రాజా సాబ్‘ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి.

ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ది రాజా సాబ్‘ కోసం ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. అయితే.. ఆమధ్య గాయం కారణంగా ప్రభాస్ ఇటలీలో రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో ‘ది రాజా సాబ్‘ ఇప్పట్లో రావడం కష్టమే అనే ఊహాగానాలు వినిపించాయి. కానీ.. లేటెస్ట్ గా ఈ మూవీ తిరిగి పట్టాలెక్కింది.

ప్రస్తుతం హైదరాబాద్ లోని అజీజ్‌నగర్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పాల్గొంటున్నాడట. త్వరలోనే.. ప్రభాస్ కూడా షూట్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంగా.. ఈ ఏడాది చివరిలో లేదా.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ‘ది రాజా సాబ్‘ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

Tags

Next Story