‘ఓజీ’ హంగామా మొదలైంది

‘ఓజీ’ హంగామా మొదలైంది
X
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా కోసం అభిమానులు ఎదురుచూపులు ఎప్పటినుంచో కొనసాగుతున్నాయి. ఇక సినిమా విడుదలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఇప్పుడు ప్రమోషన్స్ హై పిచ్‌లో సాగుతున్నాయి.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా కోసం అభిమానులు ఎదురుచూపులు ఎప్పటినుంచో కొనసాగుతున్నాయి. ఇక సినిమా విడుదలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఇప్పుడు ప్రమోషన్స్ హై పిచ్‌లో సాగుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ఈ సినిమా టికెట్స్ పెంపుకు ఆమోద ముద్రవేశాయి.

లేటెస్ట్ గా హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మల్టీప్లెక్స్ యాజమాన్యం తమ అధికారిక ‘ఎక్స్’ అక్కౌంట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. మరోవైపు రేపు ‘ఓజీ‘ ట్రైలర్ రాబోతుంది. అలాగే.. రేపు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ లెవెల్ లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Tags

Next Story