‘ఓజీ‘ వేట మొదలైంది!

‘ఓజీ‘ వేట మొదలైంది!
X
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత హైప్ సృష్టించిన చిత్రాల్లో ఒకటైన ‘ఓజీ’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత హైప్ సృష్టించిన చిత్రాల్లో ఒకటైన ‘ఓజీ’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. సుజీత్ దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

‘ఓజీ’లో పవన్ కళ్యాణ్‌తో పాటు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. ఇక ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ రూ.80 కోట్లు, ఇమ్రాన్ హష్మి రూ.5 కోట్లు, డైరెక్టర్ సుజీత్ రూ.8 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రూ.5 కోట్లు, ప్రియాంక మోహన్ రూ.1.5 కోట్లు, శ్రియా రెడ్డి రూ.50 లక్షలు పారితోషికం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో ఈ సినిమా టిక్కెట్లకు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది. ఇక రేపటి రాత్రి నుంచే స్పెషల్ షోలు ఉండటంతో అభిమానులు ‘ఓజీ‘ని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

మరోవైపు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ జారీ చేసింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ముంబై మాఫియా ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వైలెన్స్ కి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండటమే A సర్టిఫికెట్ కి కారణమని చెబుతున్నారు. అయితే దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరం కావచ్చన్న ఆందోళన కనిపిస్తోంది.

అలాగే ఒక వైపు భారీ హైప్ ఉన్నా మరో వైపు రిలీజ్ ప్లానింగ్‌లో హడావిడి కనిపిస్తోంది. ఇటీవల కాన్సర్ట్ ప్లానింగ్ గందరగోళం అవ్వడం.. చిత్రబృందం ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ నిర్వహించకపోవడం వంటివి అభిమానులను అసహనానికి గురిచేస్తున్నాయి. ఇంకా.. యూఎస్ ప్రీమియర్స్‌కు ముందు కంటెంట్ డెలివరీ ఆలస్యం అవ్వడం.. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కాకపోవడం కూడా ‘ఓజీ‘కి కొంచెం ప్రతికూలాంశాలుగా మారుతున్నాయి.

Tags

Next Story