బాక్సాఫీస్ యుద్ధానికి రంగం సిద్ధం

బాక్సాఫీస్ యుద్ధానికి రంగం సిద్ధం
X
బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’. 2021లో విడుదలైన 'అఖండ' సినిమా బంపర్ హిట్ అందుకోవడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’. 2021లో విడుదలైన 'అఖండ' సినిమా బంపర్ హిట్ అందుకోవడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంటలు లేటెస్ట్ గా 'అఖండ 2' గురించి క్రేజీ అప్డేట్ అందించారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆగస్టు 15 నాటికి ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని, సెప్టెంబర్ 1కి ఓవర్సీస్ కాపీ పంపిస్తామని తెలిపారు. దీంతో 'అఖండ 2' పోస్ట్ పోన్ అవ్వబోతుందనే వార్తలకు చెక్ పడినట్టు అయ్యింది.

ఇటీవల 'అఖండ 2' వాయిదా పడుతోందా? అనే పుకార్లు ప్రచారం కావడంతో అభిమానులు కంగారు పడ్డారు. దీనిపై స్పష్టత ఇచ్చిన మేకర్స్, ఒక పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయిందని, అది కూడా ప్రత్యేక పాటేనని చెప్పారు. VFX పనులు శ్రమతో కూడుకున్నవైనా కూడా, సమయానికి పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట. మొత్తానికి సినిమాను దసరా స్పెషల్ గా సెప్టెంబర్ 25నే విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్సయ్యారు.

మరోవైపు, అదే రోజున పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓజీ' కూడా విడుదల కాబోతుండటంతో, ఈసారి బాలయ్య vs పవన్ బాక్సాఫీస్ వార్ ఖాయమైనట్టే అనే సంకేతాలు వస్తున్నాయి. గతంలో వీరి సినిమాలు సమాంతరంగా రావడం మినహా, ఈ రేంజ్ పోటీ మాత్రం తొలిసారి కావడం విశేషం.

Tags

Next Story