‘రౌడీ జనార్ధన్’కి ముహూర్తం ఫిక్స్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో విజయ్ కొత్త సినిమా ముహూర్తానికి రెడీ అయ్యింది. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్–దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.
ఈ సినిమాకు ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి చిత్రం ప్రేమకథతో మెప్పించిన రవి కిరణ్ ఈసారి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వస్తుండటమే స్పెషల్. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. అక్టోబర్ 16 నుంచి ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా కనిపించే అవకాశాలున్నాయి. 2026లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరోవైపు.. ఇప్పటికే రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో ఇప్పటికే కొత్త సినిమాని షురూ చేశాడు రౌడీ స్టార్.
-
Home
-
Menu