'కూలీ' మేనియా మొదలైంది

కూలీ మేనియా మొదలైంది
X
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'కూలీ'.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'కూలీ'. సెన్సేషనల్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది. లేటెస్ట్ గా 'కూలీ' టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. గడిచిన గంటలో టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ 'బుక్ మై షో'లో 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇదొక్కటి చాలు 'కూలీ' క్రేజ్ ఏ రేంజులో ఉందో చెప్పడానికి.

గోల్డ్ వాచెస్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ లో తన మార్క్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో లోకేష్ కనకరాజ్ 'కూలీ' చిత్రాన్ని తెరకెక్కించాడు. అనిరుధ్ మ్యూజిక్, బి.జి.ఎమ్ 'కూలీ'కి టెక్నికల్ గా మరో అడ్వాంటేజ్. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే చేసిన 'మోనిక' సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. మొత్తంగా.. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన 'కూలీ' విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు కొల్లగొడుతుందనే అంచనాలున్నాయి.

Tags

Next Story