ముగ్గురు హీరోల కలయిక – ‘హిట్ 3’లో థ్రిల్ ట్రిపుల్!

'హిట్' ఫ్రాంచైజీ మూడో భాగమైన 'హిట్: ది థర్డ్ కేస్' అంచనాలను పెంచుతోంది. ఈసారి కథకు కొత్త మలుపు ఇచ్చేలా నాని ప్రధాన పాత్రలో కనిపించనుండగా, మొదటి రెండు భాగాల్లో నటించిన విశ్వక్ సేన్, అడవి శేష్ కూడా కేమియోలలో మురిపించబోతున్నారట. ఇప్పటివరకూ వీరి కేమియోస్ గురించి ప్రకటించనప్పటికీ.. సినిమాలో వాళ్ల పాత్రలు కీలకమైన సన్నివేశాల్లో సందడి చేయబోతున్నాయనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది.
దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్ 3‘ని ఉత్కంఠభరితంగా మలిచాడట. ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని సన్నివేశాల్లో నాని పోలీస్ క్యారెక్టర్ లో చాలా వయలెంట్ గా కనిపించాడు. పైగా నానికి ఇది ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్. ఈ సినిమాలో నానికి జోడీగా ‘కె.జి.యఫ్‘ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తుంది. మొత్తంగా నానితో పాటు.. ‘హిట్‘ సిరీస్ లోనూ మిగతా హీరోలు విశ్వక్, అడవి శేష్ కూడా ‘హిట్ 3‘లో సందడి చేయబోతున్నారన్నమాట. మే 1న ‘హిట్ 3‘ విడుదలకు ముస్తాబవుతుంది.
-
Home
-
Menu