'తమ్ముడు' ట్విట్టర్ రివ్యూ

తమ్ముడు ట్విట్టర్ రివ్యూ
X
నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.

నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించగా, సీనియర్ నటి లయ కీలక పాత్రలో కనిపించనుంది. ‘రాబిన్ హుడ్‘ నిరాశపరచడంతో ఈ చిత్రంతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు నితిన్. ఈరోజు గ్రాండ్ లెవెల్ లో ‘తమ్ముడు‘ రిలీజ్ అవుతుంది.

ఇప్పటికే ఓవర్సీస్ లో 'తమ్ముడు' ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో 'తమ్ముడు' టాక్ గురించి పలు రివ్యూలు సందడి చేస్తున్నాయి. మల్టీ లేయర్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ట్విట్టర్ రివ్యూలలో 'తమ్ముడు' పాజిటివ్ పాయింట్స్ విషయానికొస్తే

నితిన్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఎమోషనల్ సీన్లు, బీజీఎం, విలన్ క్యారెక్టరైజేషన్ ప్రత్యేకంగా నిలిచాయనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ టాప్ నాట్చ్‌గా ఉన్నాయంటున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ నటన మెప్పించిందని కామెంట్స్ వస్తున్నాయి.

మరోవైపు నెగటివ్ పాయింట్స్ విషయానికొస్తే.. స్టోరీ గొప్పగా లేదని, ఊహించదగిన స్క్రీన్‌ప్లే అని కొందరు రివ్యూస్ ఇస్తున్నారు. అలాగే పాటలు ఆకట్టుకోలేదని, యాక్షన్ సీన్లు లెంగ్తీగా ఉన్నాయనే కామెంట్స్ కొందరు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇక సెకండాఫ్ బోరింగ్ అనిపించిందని, అక్కా-తమ్ముడు సెంటిమెంట్ వర్కవుట్ కాలేదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

మొత్తానికి 'తమ్ముడు' చిత్రానికి ప్రీమియర్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఇది నితిన్‌కు కం‌బ్యాక్ మూవీగా అభివర్ణిస్తే, మరికొందరు సినిమా థీమ్ కొత్తగా ఉన్నా కథలో కొత్తదనం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story