సూపర్ యోధుడిగా తేజ సజ్జ

సూపర్ యోధుడిగా తేజ సజ్జ
X
బాల నటుడిగా అదరగొట్టిన తేజ సజ్జ.. హీరోగా ఇప్పుడు వరుస విజయాలు అందుకుంటున్నాడు. ‘జాంబిరెడ్డి‘తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని ‘హనుమాన్‘తో పాన్ ఇండియా హీరోగా అవతరించాడు తేజ.

బాల నటుడిగా అదరగొట్టిన తేజ సజ్జ.. హీరోగా ఇప్పుడు వరుస విజయాలు అందుకుంటున్నాడు. ‘జాంబిరెడ్డి‘తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని ‘హనుమాన్‘తో పాన్ ఇండియా హీరోగా అవతరించాడు తేజ. ‘హనుమాన్‘ చిత్రం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ‘హనుమాన్‘ తర్వాత ప్రస్తుతం ‘మిరాయ్‘తో రాబోతున్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రెడీ అవుతుంది. పీరియాడిక్ టచ్ తో ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. ఈరోజు తేజ సజ్జ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.

ఈ మేకింగ్ వీడియోలో సూపర్ యోధగా మారడానికి తేజ సజ్జ పడ్డ కష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. యాక్షన్ సీన్స్ కోసం తేజ ఎలాంటి కసరత్తులు చేశాడనేది ఈ బిహైండ్ ది సీన్స్ లో ఆకట్టుకుంటున్నాయి. అసలు సెప్టెంబర్ 5న రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతుంది.



Tags

Next Story