తారక్ స్టేట్మెంట్ వైరల్

'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంపాదించిన ఎన్టీఆర్, ఇప్పుడు బాలీవుడ్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి తారక్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రాబోతోంది.
లేటెస్ట్ గా ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తారక్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 'నా జీవితంలో ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోను. నా దృష్టి ఎప్పుడూ వర్తమానంపైనే ఉంటుంది. సినీ వారసత్వం విషయంలో నాకేం తెలియదు. కానీ నేను నటించిన సినిమాల ద్వారా, నేను చెప్పే కథల ద్వారా గుర్తుండిపోవాలని ఆశిస్తాను. కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా – ఒక నిజాయితీ గల మనిషిగా నన్ను గుర్తించాలని కోరుకుంటాను' అంటూ భావోద్వేగాలతో తన మనసులో మాటను షేర్ చేసుకున్నాడు.
ఈ ఇంటర్యూకు సంబంధించిన ఫోటోషూట్ దుబాయ్‌లో జరిగింది. మ్యాగజైన్ కవర్ పేజీపై తారక్ రాయల్ లుక్‌లో మెరూన్ షార్వానిలో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. ‘టీన్ ప్రాడిజీ నుంచి పాన్-ఇండియా పవర్‌హౌస్’గా తారక్ మారిన ప్రస్థానాన్ని ఈ మ్యాగజైన్ ప్రశంసించింది. ఇక 'వార్ 2' తర్వాత ఎన్టీఆర్ లైనప్ క్రేజీగా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్‌ల మధ్య రూపొందుతోంది.
NTR (@tarak9999) like you’ve never seen him before. For our cover shoot, the superstar brought his signature swag—paired with a fresh take on power dressing. Watch the full video for an inside look at how the cover came to life against Dubai’s stunning skyline. pic.twitter.com/7DFWgGgmTB
— Esquire India (@esquire_india) August 5, 2025
-
Home
-
Menu