తారక్ vs రజనీ – ట్రైలర్ యుద్ధానికి రెడీ!

తారక్ vs రజనీ –  ట్రైలర్ యుద్ధానికి రెడీ!
X
ఈ ఏడాది ఆగస్టు 14న రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్‌పై దాడి చేయబోతున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు 14న రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్‌పై దాడి చేయబోతున్నాయి. వీటిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కలిసి నటించిన మల్టీస్టారర్ ‘వార్ 2‘ ఒకటి కాగా.. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి మల్టీ కాస్టింగ్ తో వస్తోన్న ‘కూలీ‘ మరొకటి.

ఒకే రోజు ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీస్ ఇప్పటికే ప్రమోషన్స్ ను పీక్స్ లో నిర్వహిస్తున్నాయి. ఈ రెండు సినిమాల నుంచి ఇప్పటివరకూ వచ్చిన కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు ఈ సినిమాల ట్రైలర్స్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు ట్రైలర్లు కేవలం వారం తేడాతో విడుదల కాబోతుండటంతో హైప్ తారాస్థాయికి చేరింది.

తారక్-హృతిక్ ‘వార్ 2‘ ట్రైలర్ జూలై 23న రిలీజవుతుంది. 2 నిమిషాల 39 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్‌ కు ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా YRF స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రం. ట్రైలర్ తర్వాత ‘వార్ 2‘ నుంచి ఎన్టీఆర్-హృతిక్‌ స్పెషల్ సాంగ్‌ కూడా రిలీజ్ చేయనుందట టీమ్.

మరోవైపు లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ‘ సినిమా నుంచి ట్రైలర్ రాబోతుంది. ‘వార్ 2‘ ట్రైలర్ వచ్చిన వారానికి ఆగస్టు 2న ‘కూలీ‘ ట్రైలర్ విడుదలకానుంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ‘మోనిక‘ వచ్చి హిట్ అయింది. మొత్తంగా ఒకేసారి విడుదల కానున్న ఈ రెండు సినిమాల మధ్య కాంపిటేషన్ ఓ రేంజులో ఉంది. మరి.. ట్రైలర్స్ తో ఈ చిత్రాలపై అంచనాలు ఇంకా ఏ స్థాయిలో పెరుగుతాయో చూడాలి.

Tags

Next Story